Friday, May 10, 2024

మరో థ్రిల్లింగ్ వీకెండ్ బ్లాక్ బస్టర్‌తో తిరిగి వచ్చిన జీ నెట్‌వర్క్‌..

ఎల్లప్పుడూ తన ప్రేక్షకులను అలరించడమే లక్ష్యంగా పెట్టుకున్న జీ నెట్‌వర్క్‌ ఇప్పుడు అది మరో థ్రిల్లింగ్ వీకెండ్ బ్లాక్‌బస్టర్‌తో తిరిగి వచ్చింది. స్పైడీ అభిమానులందరికీ విత్‌ గ్రేట్‌ పవర్‌, కమ్స్‌ గ్రేట్‌ రెస్పాన్సిబిలిటీ అనే గొప్ప మంత్రం వారి టెలివిజన్‌ స్క్రీన్‌లపై అత్యంత ప్రసిద్ధ స్పైడర్‌ మ్యాన్‌ చిత్రం స్పైడర్‌ మ్యాన్‌: నో వే హోమ్‌ ప్రీమియర్‌తో ఆగస్టు 21న నిజం అవ్వబోతోంది. కొత్తగా విడుదలై, విస్తృతంగా ప్రజాదరణ పొందిన ఈ చలనచిత్రం ఎంతో ఆసక్తి రేపే మల్టీవర్స్‌ అనే కాన్సెప్ట్‌ని పరిచయం చేస్తూ, ముగ్గురు స్పైడీలతో వినోదాన్ని 3 రెట్లు పెంచుతుంది.

టామ్‌ హాలండ్‌, ఆండ్రూ గార్ఫీల్డ్‌ అండ్‌ టోబి మగ్వైర్‌ అన్ని తరాల ప్రేమను ఏకం చేసారు. ముగ్గురు పీటర్‌ పార్కర్లు ఏకమై చెడుతో పోరాడడాన్ని చూసి స్పైడర్‌ మ్యాన్‌ అభిమానులందరూ గొంతు పగిలేలా అరిచారు. ఎలెక్ట్రో (జేమీ ఫాక్స్‌), గ్రీన్‌ గాబ్లిన్‌ (విలియం డఫో), డాక్టర్‌ ఆట్టో ఆక్టేవియస్‌ (ఆల్ఫ్రెడ్‌ మోలినా) మొదలైన వారితో సహా అనేక మంది విలన్‌లను ఫ్రాంచైజీ నుండి తిరిగి తీసుకురావడంతో ఈ చిత్రం పాత జ్ఞాపకాల ఆనందాన్ని ఒక మెట్టు- ఎక్కిస్తుంది. జాన్‌ వాట్స్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో జెండయా ఎమ్‌జెగా (పీటర్‌ పార్కర్‌ ప్రేమక), బెనెడిక్ట్‌ కంబర్‌బాచ్‌ డాక్టర్‌ స్ట్రేంజ్‌గా, జేకబ్‌ బటాలోన్‌ నెడ్‌ లీడ్స్‌గా, జాన్‌ ఫావ్‌రూ హ్యాపీ హొగన్గా, ఇతర ప్రముఖులు కూడా నటించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement