Sunday, May 5, 2024

ఈ ఏడాది మాకు ప్రత్యేకం…చరణ్ కు తారక్ స్పెషల్ విషెస్

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా సోషల్ మీడియా వేదికగా అభిమానులు, సినీ ప్రముఖులు విషెస్ లు తెలుపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే యంగ్ టైగర్ ఎన్టీఆర్ కూడా సోషల్ మీడియా వేదికగా విషెస్ అందించారు. రామ్ చరణ్ తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ ఈ విషెస్ తెలిపారు.

ఈ సంవత్సరం మాకు ప్రత్యేకం కానుంది. నా సోదరుడితో లో గడిపిన ప్రతిక్షణం గొప్పగా ఉంది. ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ట్వీట్ చేశారు ఎన్టీఆర్. ఇక చరణ్ ఎన్టీఆర్ కలిసి రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే . భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా, ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement