Friday, May 17, 2024

అజయ్ దేవగన్ లుక్ పై ఎన్టీఆర్ ఎలా రియాక్ట్ అయ్యాడో తెలుసా ?

దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా కోసం అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ లు, లుక్స్ సినిమాపై అంచనాలను రెట్టింపు చేశాయి. కాగా ఈ రోజు అజయ్ దేవగన్ పుట్టినరోజు సందర్భంగా చిత్ర యూనిట్ ఆయన లుక్ తో పాటు మోషన్ పోస్టర్ ని రిలీజ్ చేసింది. తుపాకీ గుళ్ళు తో అదిరిపోయే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఎప్పుడూ చూడని విధంగా దర్శకధీరుడు అజయ్ ని చూపించాడు.

అయితే ఈ పోస్టర్ పై యంగ్ టైగర్ ఎన్టీఆర్ స్పందించారు. అజయ్ దేవగన్ నెవర్ బిఫోర్ అంటూ కామెంట్ చేశారు. ఇక ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రాంచరణ్… కొమరం భీమ్, అల్లూరి సీతారామరాజు పాత్ర లో కనిపిస్తున్న సంగతి తెలిసిందే. అలాగే అజయ్ దేవగన్ రోజు కూడా ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్నారు. సుమారు 450 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement