Friday, May 3, 2024

మీరు అనుకున్నదానికన్న మీ మీద నాకు ప్రేమ ఎక్కువ…మహేష్ విషెస్

సీనియర్ సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు నేడు. ఈ సందర్భంగా సినీ రాజకీయ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా కృష్ణకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కుమారుడు టాలీవుడ్ హీరో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. జన్మదిన శుభాకాంక్షలు నాన్న… నాకు ఎప్పుడూ ఉన్నతమైన దారినే చూపిస్తున్న మీకు థాంక్స్ తెలియజేస్తున్నాను. నీకు తెలిసిన దానికంటే ఎక్కువే నా ప్రేమ నీ మీద ఉంటుంది అంటూ చెప్పుకొచ్చారు మహేష్.

ఇక సినిమాల విషయానికొస్తే మహేష్ ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement