Saturday, May 4, 2024

సునీల్ లక్ మారుతుందా ?

కమెడియన్ సునీల్ గురించి తెలుగు సినీ అభిమానులకు కొత్తగా పరిచయం చేయనవసరం లేదు. కెరీర్ ప్రారంభంలో వరుస సినిమాల్లో కమెడియన్ గా నటించి మెప్పించాడు సునీల్. అయితే ఆ తర్వాత హీరో గా ఎంట్రీ ఇచ్చాడు. ఒకటి రెండు మినహా సరైన హిట్ మాత్రం కొట్టలేకపోయారు సునీల్. దీంతో మళ్లీ ట్రాక్ మార్చి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ ప్లే చేశాడు.

అయితే మళ్లీ ఇప్పుడు హీరోగా సునీల్ సినిమా చేయబోతున్నట్లు తెలుస్తోంది. అంజి డైరెక్షన్ లో ఇంట్రెస్టింగ్ సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా చేయబోతున్నట్లు సమాచారం. ఈ చిత్రానికి బుజ్జి ఇలా రా అనే టైటిల్ ని ఫిక్స్ చేశారట. చాందినీ తమిళరసన్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తోంది. మరి ఈసారైనా సునీల్ హిట్ అందుకుంటాడో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement