Saturday, April 20, 2024

హైదరాబాద్: నడిరోడ్డుపై పోలీస్‌ వాహనంలో మంటలు

హైదరాబాద్ ఖైరతాబాద్ కూడలిలో పోలీసు ఎస్కార్ట్ వాహనం దగ్ధమైంది. ఖైరతాబాద్ సిగ్నల్స్ వద్ద వెళుతున్న పోలీస్ ఎస్కార్ట్ సుమో కారులో ఒక్కసారిగా మంటలు చేలరెగాయి. ఇంజనులో నుండి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో ఈ ఘటన చోటు చేసుకుంది. సుమోలో నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో ప్రయాణిస్తున్న వారు వెంటనే అప్రమత్తమై దిగిపోయారు. దీంతో ప్రాణాపాయం తప్పింది. షార్ట్ సర్క్యూట్‌తో జీపులో మంటలు చెలరేగినట్లు తెలుస్తోంది. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వాహనంలో మంటలను అదుపులోకి తెచ్చారు. 

YouTube video
Advertisement

తాజా వార్తలు

Advertisement