Tuesday, April 30, 2024

విజయ్ దళపతి ని టార్గెట్ చేసిన బిజెపి అభిమానులు ?

తమిళ స్టార్ హీరో విజయ్ దళపతి మంగళవారం ఉదయం ఓటు వేయడానికి సైకిల్ మీద వచ్చిన సంగతి తెలిసిందే. కాగా పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలకు నిరసనగా విజయ్ సైకిల్ పై వచ్చాడంటూ సోషల్ మీడియాలో నెటిజన్లు మాట్లాడుకున్నారు. అలాగే మీడియాలో సైతం వార్తలు కూడా వచ్చాయి.

అయితే ఆ తర్వాత విజయ్ బైక్ పై కూర్చుని వెళ్తున్న ఫోటో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. ఇది చూసిన బిజెపి కార్యకర్తలు, అభిమానులు విజయ్ దళపతిని ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. నీకు రావడానికి పెట్రోలు లేదు సరే. మీ పక్కన ఉన్న అనుచరులకు పెట్రోల్, డీజిల్ ఎలా వచ్చింది. ఆ తర్వాత నువ్వు ఎలా బైక్ పైన వెళ్ళావు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement