Saturday, July 13, 2024

పెరేంట్స్ క్ల‌బ్ లోకి వెల్ క‌మ్-చరణ్..ఉపాసన.. ఎన్టీఆర్ ట్వీట్

పెరేంట్స్ క్ల‌బ్ లోకి వెల్ క‌మ్ అని ట్వీట్ చేశారు యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్. కాగా మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చరణ్ కి క్లోజ్ ఫ్రెండ్ ఎన్టీఆర్ అనే సంగ‌తి తెలిసిందే. కాగా రామ్ చ‌ర‌ణ్..ఉపాస‌న‌లు త‌ల్లిదండ్రుల‌య్యారు. నేడు ఉపాస‌న ఆడ‌పిల్ల‌కి జ‌న్మ‌నిచ్చారు. ఈ సందర్భంగా ట్వీటర్ వేదికగా చరణ్, ఉపాసనను విష్ చేస్తూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. ఎన్టీఆర్ ట్వీట్ చేస్తూ.. ‘రామ్ చరణ్ – ఉపాసన మీకు నా శుభాకాంక్షలు. పెరేంట్స్ క్లబ్ లోకి మిమల్ని ఆహ్వానిస్తున్నాను. పండంటి ఆడబిడ్డకు జన్మనివ్వడం సంతోషంగా ఉంది. ఆడబిడ్డతో గడిపే ప్రతిక్షణం ఆనందంగా ఉంటుంది. దేవుడు ఆమెను, మీ అందరికీ మరింత సంతోషాన్ని అందించాలని ఆశిస్తున్నాను అంటూ విష్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారింది. ఎన్టీఆర్ ..రామ్ చరణ్ చివరిగా ‘ఆర్ఆర్ఆర్’లో కలిసి నటించిన విషయం తెలిసిందే. ఈ చిత్రం వరల్డ్ వైడ్ గా ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేసిందో తెలిసిందే. దీంతో వీరిద్దరూ గ్లోబల్ స్టార్స్ గాను గుర్తింపు దక్కించుకున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement