Saturday, May 4, 2024

Jeetoo Joseph : వెబ్ సిరీస్ బాట‌ప‌ట్టిన దృశ్యం ద‌ర్శ‌కుడు

దృశ్యం, దృశ్యం 2 సినిమాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న దర్శకుడు జీతూ జోసెఫ్ ఓ వెబ్‌సిరీస్ చేయబోతున్నాడు. సీనియర్ హీరోయిన్ మీనా ఈ వెబ్ సిరీస్ లో ప్రధాన పాత్రలో నటించనుంది. జీతూ జోసెఫ్ దర్శకత్వంలో రూపొందిన దృశ్యం, దృశ్యం -2 సినిమాల్లో మీనా హీరోయిన్‌గా కనిపించింది.

- Advertisement -

తన కూతుళ్లను కాపాడుకోవడానికి ఆరాటపడే సగటు మధ్య తరగతి తల్లిగా రియలిస్టిక్ నటనతో ప్రేక్షకుల్ని మెప్పించింది. అయితే ఈ సిరీస్‌కు జీతూ జోసెఫ్ డైరెక్టర్‌గా కాకుండా షో రన్నర్‌గా , ప్రజెంటర్‌గా వ్యవహరించబోతున్నాడు. క్రైమ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కుతోన్న ఈ వెబ్‌సిరీస్‌కు రోస్లిన్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు.

ఈ వెబ్‌సిరీస్‌కు సుమేష్ నందకుమార్ దర్శకత్వం వహిస్తున్నాడు. వినాయక్ శశికుమార్ కథను అందిస్తున్నారు. ఇందులో మీనాతో పాటు ప్రేమదేశం ఫేమ్ వినీత్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. సంజనా దీపు ,హకీమ్ షా కూడా ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. జీతూ జోసెఫ్ సినిమాల తరహాలోనే ఊహలకు అందని ట్విస్ట్‌లు టర్న్‌లతో రోస్లిన్‌ వెబ్‌సిరీస్ సాగనున్నట్లు సమాచారం. ఈ సిరీస్ టైటిల్‌కు సీక్రెట్ స్టోరీస్ అనే క్యాప్షన్ ను పెట్టారు.. ఇటీవల ఈ వెబ్‌సిరీస్ ప్రీ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఇందులో ఓ కన్నుపై అమ్మాయి నిల్చొని ఉన్నట్లుగా పోస్టర్‌ను వెరైటీగా డిజైన్ చేశారు. పోస్టర్‌లో ఓ పాతకాలం నాటి బిల్డింగ్ కనిపిస్తోంది. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో బాగా వైరల్‌గా మారింది.రోస్లిన్ వెబ్‌సిరీస్ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ కాబోతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement