Saturday, December 7, 2024

TSPSC గ్రూప్ వ‌న్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు పొడిగింపు …

గ్రూప్-1 దరఖాస్తుల గడువును తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పొడిగించింది. మరో రెండురోజుల పొడిగిస్తూ నిర్ణయం తీసుకుంది. దరఖాస్తులకు నేడు చివరి రోజు కాగా ఆ గ‌డువును శనివారం సాయంత్రం 5 గంటల వరకు పొడిగించింది. చివరిరోజు టీఎస్పీఎస్సీ సర్వర్ పనిచేయకపోవడంతో అభ్యర్థులు తీవ్ర ఆందోళన చెందారు. ఈ క్రమంలో.. టీఎస్పీఎస్సీ ఈ నిర్ణయం తీసుకుంది.

మొత్తం పోస్టులు 563

రాష్ట్ర వ్యాప్తంగా ఖాళీగా ఉన్న 563 గ్రూప్‌-1 పోస్టుల భర్తీకి గత నెల 19న నోటిఫికేషన్‌ విడుదలైన విషయం తెలిసిందే. అయితే.. ఫిబ్రవరి 23 నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులను స్వీకరిస్తోంది. కాగా.. బుధవారం వరకు 2.7 లక్షలకు పైగా దరఖాస్తులు చేసుకున్నారు. . ఇప్పటికీ దరఖాస్తు చేసుకోని వారు ఆన్‌లైన్‌ https://www.tspsc.gov.in/ ద్వారా అప్లై చేసుకోవచ్చు. గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష జూన్ 9న, మెయిన్స్ అక్టోబర్ 21న జరుగనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement