Saturday, May 11, 2024

బ‌ల‌గం చూస్తూ.. ఎమోష‌న‌ల్ అయిన ప్రేక్ష‌కులు

క‌మెడియ‌న్ గా వ‌చ్చి డైరెక్ట‌ర్ గా మారాడు వేణు.. మెగా ఫోన్ ప‌ట్టిన వేణు బ‌ల‌గం చిత్రంతో హిట్ కొట్టాడు. దర్శకుడిగా వేణు తొలి ప్రయత్నంలోనే తిరుగులేని విజయం సాధించారు.పల్లె అందాలను, తెలంగాణ సాంప్రదాయాలను, మనుషుల భావోద్వేగాలను వేణు కళ్లకు కట్టినట్లు చూపించాడు. ఇక ప్రియదర్శి, కావ్య కళ్యాణ్‌రామ్‌తో పాటు ఈ సినిమాలో నటించిన వారందరూ ది బెస్ట్‌ అవుట్‌ పుట్‌ ఇచ్చారు. భీమ్స్ పాటలు కూడా సినిమాకు బలంగా మారాయి. చిన్న సినిమాగా విడుదలైన బలగం చిత్రం బాక్సాఫీస్‌ దగ్గర కాసుల వర్షం కురిపిస్తుంది. డిస్ట్రిబ్యూటర్‌లకు కళ్లు చెదిరే లాభాలు తెచ్చిపెడుతుంది. ఇక ఈ మధ్య పలు ఊర్లలో ఈ సినిమాను ఆరుబయట స్క్రీన్‌ను ఏర్పాటు చేసుకుని మరీ ప్రేక్షకులు ఈ సినిమాను వీక్షిస్తున్నారు. తాజాగా ఓ ఊర్లో జనాలందరూ కలిసి స్క్రీన్‌ను ఏర్పాటుచేసుకుని సినిమాను వీక్షించారు. కాగా ఈ సినిమా క్లైమాక్స్‌ చూసి కంటతడి పెడుతున్నారు. ఆడవాళ్లు, మగవాళ్లు అని తేడా లేకుండా అందరూ ఎమోషనల్‌కు గురయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్‌ అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement