Saturday, May 18, 2024

ఓటీటీలో విక్రాంత్ రోణ తెలుగు వెర్షన్.. ఏ ప్లాట్ ఫామ్ లో స్ట్రీమింగ్ అవుతుందంటే.!

కిచ్చా సుదీప్ హీరోగా పీరియాడిక‌ల్ క‌థాంశంతో రూపొందిన సినిమా విక్రాంత్ రోనా. అనూప్ భండారీ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమా జూలై 28న థియేట‌ర్ల‌లో విడుద‌లై వ‌ర‌ల్డ్ వైడ్‌గా 200 కోట్ల‌కుపైగా క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ హిట్‌గా నిలిచింది. కాగా, ఈ సినిమా క‌న్న‌డ వెర్ష‌న్ సెప్టెంబ‌ర్ 2న జీ5 ఓటీటీలో విడుద‌లైంది. ఇక‌ ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ కూడా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుంది.

తెలుగు వెర్ష‌న్ మాత్రం నిన్న (సెప్టెంబ‌ర్ 16) నుంచి డిస్నీ ప్ల‌స్‌హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. తెలుగుతో పాటు హిందీ వెర్ష‌న్ డిస్నీ ప్ల‌స్ హాట్‌స్టార్‌లో అందుబాటులోకి వ‌చ్చింది. కొమ‌ర‌ట్టు అనే ఫిక్ష‌నల్ విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో జ‌రిగే క‌థ‌తో ఈసినిమా తెర‌కెక్కింది. ఆ ఊరిలో వ‌రుస‌గా చిన్న‌పిల్ల‌లు హ‌త్య‌ల‌కు గుర‌వుతుంటారు. ఆ హ‌త్య‌ల వెన‌కున్న మిస్ట‌రీని విక్రాంత్ రోణ అనే పోలీస్ ఆఫీస‌ర్ ఎలా ఛేదించాడ‌నే క‌థాంశానికి గ్రాఫిక్స్ హంగుల‌ను జోడించి ద‌ర్శ‌కుడు అనూప్ భండారీ ఈ సినిమాను తెర‌కెక్కించాడు. ఇందులో నెగెటివ్ షేడ్స్ తో కూడిన క్యారెక్ట‌ర్‌లో ద‌ర్శ‌కుడు అనూప్ భండారీ సోద‌రుడు నిరూప్ భండారీ క‌నిపించారు. గ్రాఫిక్స్‌, విజువ‌ల్స్‌తో పాటు సుదీప్ యాక్టింగ్‌, అత‌డిపై తెర‌కెక్కించిన పోరాట ఘ‌ట్టాల‌కు మంచి పేరు వ‌చ్చింది. ఈ సినిమాకు విక్రాంత్ రోణ 2 పేరుతో సీక్వెల్ రూపొందించ‌బోతున్న‌ట్లు ద‌ర్శ‌కుడు ప్ర‌క‌టించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement