Thursday, April 25, 2024

400 థియేటర్లలో రిలీజ్ కానున్న‌ ‘విక్రమ్‌’.. ప్రేక్షలను అలరించేందుకు వస్తున్న కమల్​..

కమల్‌ హాసన్‌, దర్శకుడు లోకేష్‌ కనగరాజ్‌ కాంబినేషన్‌ లో తెరకెక్కిన థ్రిల్లర్ సినిమా ‘విక్రమ్‌’. విజయ్‌ సేతుపతి, ఫహద్‌ ఫాసిల్‌ ప్రధాన పాత్రధారులు. ఈ సినిమా ట్రైలర్‌ ఇటివలే విడుదల చేశారు. జూన్‌ 3న 400 థియేటర్లలో విడుదల కానుంది. ఈ సినిమాలో మరో హీరో సూర్య ఫుల్‌ గెస్ట్‌ రోల్‌లో అలరించబోతున్నారు. తాజాగా సెన్సార్‌ కా ర్యక్రమాలను పూర్తి చేసుకుంది ఈ సినిమా. హీరో నితిన్‌ ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేయనున్నారు. ‘విక్రమ్‌’ తెలుగు పోస్టర్‌ను కమల్‌ హాసన్‌ విడుదల చేశారు. కమల్‌ హాసన్‌ తో పాటు చిత్ర యూనిట్‌తో తెలుగులో ప్రచార వేడుక నిర్వహించనున్నారు. ఈ చిత్రానికి అనిరుధ్‌ రవి చందర్‌ సంగీతం అందిస్తుండగా, గిరీష్‌ గంగాధరన్‌ సినిమాటోగ్రాఫర్‌గా, ఫిలోమిన్‌ రాజ్‌ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement