Saturday, May 4, 2024

విజయ్ దళపతి తెలుగు సినిమా ఎంట్రీ !! రెమ్యునరేషన్ ఎంతో తెలుసా ?

విజయ్ దళపతి గురించి సినీ ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. అయితే తమిళ్ స్టార్ హీరో అయినప్పటికీ తెలుగులో కూడా మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ నేపథ్యంలోనే విజయ్ డైరెక్ట్ గా టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో విజయ్ ఓ సినిమా చేయబోతున్నాడు. అయితే ఈ సినిమాను భారీ స్థాయిలో ప్లాన్ చేయాలని నిర్మాత దిల్ రాజు భావిస్తున్నాడట.

అయితే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి పలు రకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. తాజాగా రెమ్యూనరేషన్ విషయంలో ఓ వార్త తెగ వైరల్ అవుతుంది. ఈ చిత్రానికి విజయ్ ఏకంగా 80 కోట్ల రూపాయల వరకు రెమ్యూనరేషన్ తీసుకోబోతున్నాడట. కాగా మొత్తం బడ్జెట్ 160 కోట్లకు పైగానే అని అంచనా వేస్తున్నారట. గతంలో వంశీపైడిపల్లి ఊపిరి ,మహర్షి వంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలను తీసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ ఇద్దరి కాంబినేషన్ లో సినిమా అనటంతో అంచనాలు రెట్టింపు అవుతున్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement