Saturday, May 4, 2024

ఈ నెల 19న రిలీజ్ కానున్న.. బిచ్చ‌గాడు2

బిచ్చ‌గాడు మూవీకి సీక్వెల్ తెర‌కెక్కుతోంది. ‘బిచ్చగాడు 2’తో ప్రేక్షకులను పలకరించడానికి రెడీ అవుతున్నాడు హీరో విజ‌య్ ఆంటోని. బిచ్చగాడు’ సినిమాకి శశి దర్శకుడు అయితే, సెకండ్ పార్టు దర్శకత్వ బాధ్యతలను విజయ్ ఆంటోని తీసుకున్నాడు. కావ్య థాపర్ కథానాయికగా నటించిన ఈ సినిమా, ఈ నెల 19వ తేదీన తమిళ .. తెలుగు భాషల్లో విడుదల కానుంది. హరీశ్ పేరడీ .. జాన్ విజయ్ ముఖ్యమైన పాత్రలను పోషించిన ఈ సినిమా, మరో సంచలనాన్ని సృష్టిస్తుందేమో చూడాలి.విజయ్ ఆంటోనికి తమిళంలోనే కాదు, తెలుగులోను ఫ్యాన్స్ ఉన్నారు. ఆయన సినిమాల్లోని కంటెంట్ డిఫరెంట్ గా ఉంటుందనే విషయం తెలిసిందే. ఆయన కథల్లో కొత్త పాయింట్ ఉంటుందనే నమ్మకం ఆడియన్స్ లో ఉంది. ఆయన సినిమాలు కొన్ని ఫ్లాప్ అయినా, మంచి ప్రయత్నం అనే అభినందనలు దక్కడం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement