Thursday, May 2, 2024

వెంకీ త్రివిక్రమ్ సినిమా ఫిక్స్ ?

విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం మూడు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో నారప్ప, ఎఫ్ 3 షూటింగ్ దశలో ఉండగా దృశ్యం షూటింగ్ పూర్తయింది. అయితే ఈ సినిమాల తర్వాత వెంకటేష్ ఎవరితో సినిమా చేయబోతున్నాడు అనే విషయమై సోషల్ మీడియాలో రకరకాల వార్తలు వస్తున్నాయి. వెంకటేష్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఆ సినిమా రాబోతున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.

ఇక తాజా సమాచారం ప్రకారం ఇటీవల వెంకటేష్ 75 వ సినిమాకు సంబంధించి చర్చలు జరిగాయట. త్రివిక్రమ్ దర్శకత్వంలో వెంకీ ఈ సినిమా చేయబోతున్నాడట. అందుకు త్రివిక్రమ్ వెంకీ కూడా రెడీగా ఉన్నారట. ప్రస్తుతం ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత ఈ చిత్రం ప్రారంభం కాబోతోందని తెలుస్తోంది. మరోవైపు త్రివిక్రమ్ మహేష్ బాబు తో ఓ సినిమా చేయబోతున్న సంగతి తెలిసిందే.

Advertisement

తాజా వార్తలు

Advertisement