Thursday, May 2, 2024

థియేటర్స్ లో ఇచ్చట వాహనాలు నిలుపరాదు మూవీ

ఎస్ దర్శన్ దర్శకత్వంలో నిజ సంఘటనల ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ఇచ్చట వాహనములు నిలుపరాదు. ఈ సినిమాలో టాలీవుడ్ యంగ్ హీరో సుశాంత్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. వైవిధ్యమైన థ్రిల్లర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మేర రిలీజ్ డేట్ అధికారికంగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ సినిమాలో సుశాంత్ కు జోడీగా మీనాక్షి చౌద‌రి న‌టించ‌గా, వెన్నెల కిషోర్‌, ప్రియ‌ద‌ర్శి, అభిన‌వ్ గౌత‌మ్ త‌దిత‌రులు ఇత‌ర ప్ర‌ధాన పాత్రలలో నటించనున్నారు.

ఏఐ స్టూడియోస్‌, శాస్త్ర మూవీస్ బ్యాన‌ర్స్‌పై ర‌వి శంక‌ర్ శాస్త్రి, ఎక్తా శాస్త్రి, హ‌రీశ్ కోయ‌ల గుండ్ల ఈ చిత్రాన్ని నిర్మించగా ప్ర‌వీణ్ ల‌క్క‌రాజు సంగీతాన్ని అందించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement