Friday, April 19, 2024

36 ఏళ్ల అమరరాజా ప్రయాణం.. వాట్ నెక్ట్స్?

ఏపీ నుంచి అమరరాజా పరిశ్రమ తరలిపోతోందన్న వార్తల నేపథ్యంలో ఆ సంస్థ అధినేత గల్లా జయదేవ్ స్పందించారు. తమిళనాడులో అమరరాజా సంస్థ విస్తరణపై జవాబివ్వాలని ఓ మీడియా ప్రతినిధి కోరగా, గల్లా జయదేవ్ కొంచెం కఠినంగా జవాబిచ్చారు. ఈ అంశం గురించి ప్రెస్ మీట్లో మూడుసార్లు అడిగారని, తాము మూడుసార్లు సమాధానం చెప్పామని స్పష్టం చేశారు. ఇంతకుమించి తాము దీనిపై ఏమీ చెప్పబోమని పేర్కొన్నారు. తమ భవిష్యత్ ప్రణాళికలపై నిర్ణయం తీసుకునేందుకు కొంత సమయం పడుతుందని వెల్లడించారు.


తమ పారిశ్రామిక ప్రస్థానంలో అంచెలంచెలుగా ఎదిగామని అమరరాజా సంస్థల వ్యవస్థాపకుడు గల్లా రామచంద్రనాయుడు అన్నారు. రిశ్రామికవేత్తగా ఎదిగేందుకు అనేక మెట్లు ఎక్కామని, అందుబాటులో ఉన్న వనరులతోనే ఎదగాలని భావించామని తెలిపారు. యువతకు వివిధ రకాల ఉపాధి అవకాశాలు కల్పించాలనేది తమ లక్ష్యమని చెప్పారు. 1985లో చిన్నగ్రామం కరకంబాడిలో పరిశ్రమను విస్తరించామని, అనంతరం తమ స్వగ్రామం పేటమిట్టలో పరిశ్రమ స్థాపించామని వివరించారు. అక్కడ్నించి అమరరాజా పరిశ్రమది 36 ఏళ్ల ప్రయాణమని తెలిపారు. పరిశ్రమ స్థాపనకు వ్యవసాయ సాగుభూమి వాడరాదని నిబంధన పెట్టుకున్నామని రామచంద్రనాయుడు వెల్లడించారు.

ఇలాంటి సమయంలో రాష్ట్రానికే చెందిన పారిశ్రామిక కుటుంబం నడుపుతున్న అమర రాజా సంస్థ చుట్టూ వివాదం ముసురుకుంటోంది. కాలుష్య నియంత్రణ నిబంధనలు ఉల్లంఘించారంటూ ప్రభుత్వమే ఆ సంస్థకు చెందిన పరిశ్రమను తరలించాలని ఆదేశించింది. పారిశ్రామిక పెట్టుబడుల విషయంలో అష్టకష్టాలు పడుతున్న సమయంలో 1.35 బిలియన్ డాలర్ల రెవెన్యూ దాటిన పెద్ద కంపెనీ విషయంలో ప్రభుత్వం ఇంత కఠినంగా ఎందుకు ఉందనే దానిపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి.

ప్రస్తుతం గుంటూరు తెలుగుదేశం పార్టీ ఎంపీగా ఉన్న గల్లా జయదేవ్ తండ్రి గల్లా రామచంద్రనాయుడు సారథ్యంలో 1985లో అమర రాజా కంపెనీ ప్రారంభమయింది. ఈ కంపెనీకి చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలో కరకంబాడి, చిత్తూరు సమీపంలో నూనెగుండ్లపల్లిలో రెండు యూనిట్లు ఉన్నాయి. ఈ సంస్థ దేశంలో బ్యాటరీలు తయారుచేసే రెండో అతి పెద్ద సంస్థ. ఈ సంస్థ తయారుచేసే బ్యాటరీలను 37 దేశాలకు ఎగుమతి చేస్తుంటారు. మూడున్నర దశాబ్దాల క్రితమే స్థాపించిన ఈ పరిశ్రమ కాలుష్య నియంత్రణ మండలి నిబంధనలను ఉల్లంఘించిందంటూ ఇప్పుడు ఏపీ ప్రభుత్వం నోటీసులు జారీ చేసింది.

- Advertisement -

ఇది కూడా చదవండిః పెట్రోల్‌పై రూ.3 తగ్గింపు!

Advertisement

తాజా వార్తలు

Advertisement