Thursday, May 2, 2024

Urvashi: బాల‌య్య‌తో ఊర్వ‌శి…

హాట్ సెరైన్ ఊర్వ‌శి రౌతేలా టాలీవుడ్ మెరుపులు గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. అమ్మ‌డు ఇప్ప‌టికే కుర్రకారు లో జోష్ నింపేసింది. వాల్తేరు వీర‌య్య‌..ఏజెంట్..బ్రో…స్కంద లాంటి చిత్రాల్లో హాట్ ఐటం పాట్లో న‌టించి త‌న‌కంటూ ప్ర‌త్యేక‌మైన ఇమేజ్ ని క్రియేట్ చేసుకుంది.

హీరోయిన్లు అంతా ఐటం భామ‌ల‌గా ట‌ర్న్ అవుతోన్న స‌మ‌యంలోనే ఊర్వశి త‌న మార్క్ పెర్పార్మెన్స్ తో ఆక‌ట్టుకుంది. తాజాగా బాబి ద‌ర్శ‌క‌త్వంలో బాల‌య్య హీరోగా ఓ మాస్ ఎంట‌ర్ టైన‌ర్ తెర‌కెక్కుతోన్న సంగ‌తి తెలిసిందే. ఇందులో అమ్మ‌డితో పోలీస్ గెట‌ప్ వేయించ‌డంతో పాటు ఐటం సాంగ్ కోసం రంగంలోకి దించుతున్న‌ట్లు స‌మాచారం. ఒకే దెబ్బ‌కి రెండు పిట్ట‌లు అన్న చందంగా ఒకే పారితోషికంతో రెండు ర‌కాల అడ్వాటేంజ్ లు క‌లిగేలా బాబి ఇలా ప్లాన్ చేసిన‌ట్లు తెలుస్తోంది. మ‌రి ఆ ట్రీట్ ఎలా ఉంటుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement