Sunday, May 19, 2024

ఉమ‌ర్ సంధూ వ్యాఖ్య‌ల‌పై..ఊర్వ‌శిరౌతెల్లా లీగ‌ల్ నోటీసులు

బాలీవుడ్ క్రిటిక్ ఉమ‌ర్ సంధూ చేసిన వ్యాఖ్య‌ల‌పై ఫైర్ అయింది ని ఊర్వ‌శి రౌతెల్లా.అక్కినేని అఖిల్‌ హీరోగా నటిస్తున్న ‘ఏజెంట్‌’.. అఖిల్ కెరీర్ లోనే అత్యధికంగా రూ.70 కోట్లు ఖర్చుపెట్టిన ఈ చిత్రం ఈనెల 28న ‘ఏజెంట్‌’ పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్ గా నటించగా, మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి ఓ కీలక పాత్ర పోషించారు. ఈ చిత్రంలో దర్శకుడు సురేందర్‌ రెడ్డి ఓ ప్రత్యేక పాట తెరకెక్కించారు. ఇందులో అఖిల్ తో కలిసి ఊర్వశిరౌతెల్లా కాలు కదిపింది. ఇది మాస్ ట్యూన్ లో వచ్చే జానపద గేయం అని తెలుస్తోంది.

ఈ పాట పూర్తైంది, సినిమా రిలీజ్ కు రెడీ అయ్యింది. ఇదిలా ఉంటే తనను తాను స్వయం ప్రకటిత రివ్యూ రైటర్ గా, విశ్లేషకుడుగా చెప్పుకునే ఉమర్ సింధూ చేసిన ఓ ట్వీట్ చర్చనీయాంశంగా మారింది. అఖిల్ అక్కినేని ..ఏజెంట్ చిత్రం యూరోప్ షూటింగ్ లో ఉండగా ఊర్వశీ రౌతాలా ని హెరాస్ చేసాడని, అతను ఇమెట్యూర్ ఏక్టర్ అని, అతనితో పనిచేయటం కంపర్ట్ గా లేదని ఆమె ఫీలవుతున్నట్లుగా ట్వీట్ చేసాడు. ఈ ట్వీట్ ని ఆమె ఖండిస్తూ ..లీగల్ నోటిస్ పంపింది. ఇలాంటి ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్న అతనిపై చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించుకుని లీగల్ నోటీస్ పంపినట్లు ఆమె ఇన్ స్టాగ్రామ్ లో రాసుకొచ్చింది. అయితే ఆ పోస్ట్ లో ఆమె అతని ప్రస్తావన చేయలేదు. ఈ పాటని భారీ స్థాయిలో తెరకెక్కించారని సమాచారం.

Advertisement

తాజా వార్తలు

Advertisement