Saturday, May 18, 2024

ఆది పురుష్ నుంచి అప్డేట్ రాలే!!

ఓం రౌత్ దర్శకత్వంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ఆదిపురుష్. రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ప్రభాస్ రాముడు గా కనిపించనున్నాడు. అలాగే రావణాసురుడిగా బాలీవుడ్ స్టార్స్ సైఫ్ అలీ ఖాన్ కనిపించనున్నాడు. ఇక సీతగా కృతిసనన్ కనిపించనుంది.

ఇదిలా ఉండగా శ్రీరామనవమి సందర్భంగా ఉదయం ఏడు గంటల పదకొండు నిమిషాలకు ఈ సినిమాకు సంబంధించి ఓ స్పెషల్ అప్డేట్ వస్తుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. దీంతో అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూశారు. కానీ చిత్ర యూనిట్ వారికి షాక్ ఇచ్చింది. యూనిట్ చెప్పిన సమయానికి ఎటువంటి అప్డేట్ కూడా రిలీజ్ కాలేదు. దీంతో ఫ్యాన్స్ అందరూ నిరాశకు గురయ్యారు. మరి ఈ రోజు ఆ అప్డేట్ అసలు వస్తుందో లేదో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement