Saturday, May 4, 2024

పవన్ ఫ్యాన్స్ కు శుభవార్త – మరో సినిమా ఫిక్స్ ?

ఇటీవల వకీల్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు పవన్ కళ్యాణ్. అది కాకుండా మరో రెండు సినిమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు, అలాగే సాగర్ కే చంద్ర దర్శకత్వంలో అయ్యప్పనుమ్ కొషియమ్ రీమేక్ లో నటిస్తున్నాడు. అయితే హరిహర వీరమల్లు సినిమా పూర్తయిన తర్వాత హరీష్ శంకర్ తో సినిమాను పవన్ ప్రారంభించనున్నాడు. ఒక్క హరీష్ సినిమానే కాకుండా మరికొన్ని సినిమాలు కూడా లైన్ లో ఉన్నట్లు తెలుస్తోంది.

త్వరలోనే అవి కూడా ఫైనల్ అయ్యే అవకాశం ఉన్నట్లు సమాచారం. అయితే వాటిలో ఒకటి జెబి ఎంటర్టెన్మెంట్స్ సంస్థతో ఉండే అవకాశం ఉందని సమాచారం. నిర్మాతలు జె.భగవాన్, జె.పుల్లారావు లకు నిర్మాతగా మంచి పేరు ఉంది. ఇప్పటికే కథను కూడా రెడీ చేసుకున్నారట. ఈ ఏడాది ఫుల్ బిజీగా పవన్ షెడ్యూల్ ఉండటం తో వచ్చే ఏడాది ఈ సినిమా ని స్టార్ట్ చేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement