Thursday, May 2, 2024

Indian 3 on cards | భార‌తీయుడు లేటెస్ట్ అప్‌డేట్..

కమల్ హాసన్ ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న భారతీయుడు 2తో బిజీగా ఉన్నాడు. ఈ మూవీ షూటింగ‌ శరవేగంగా జరుగుతుంది. హిట్ మూవీ సీక్వెల్‌గా భారతీయుడు 2 వస్తున్నందున అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సినిమాలో రకుల్ ప్రీత్ సింగ్, కాజల్ అగర్వాల్ కథానాయికలుగా నటిస్తుండగా, సిద్ధార్థ్, ప్రియా భవాని శంకర్, సిద్ధార్థ్, బాబీ సింహా, గురు సోమసుందరం ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

ఇక ఈ మూవీకి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. కాగా, సినిమా విడుదల కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్న తరుణంలో, ప్రొడ్యూస‌ర్ ఉదయనిధి స్టాలిన్ మీడియాతో మాట్లాడుతూ ఇండియన్ 3 ఉంటుందని చెప్పారు. ఇది సినీ ప్రేమికులందరినీ పిచ్చెక్కిస్తోంది. ఇండియన్ 2 షూటింగ్ పూర్తి కావడానికి మరో 20 రోజుల సమయం ఉంది. ఈ చిత్రం లైకా ప్రొడక్షన్స్‌పై బ్యాంక్రోల్ చేయబడింది మరియు చిత్రాన్ని ఏప్రిల్ 2024 లో విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement