Friday, May 17, 2024

మరీ ఇంత దారుణమా…’అరణ్య’ కష్టాలు !!

అరణ్య సినిమాతో శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చాడు దగ్గుబాటి రానా. జంతు సంరక్షణ, అడవుల నేపథ్యంలో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా అద్భుతంగా నటించాడు. నటుడిగా మరోసారి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నాడు. అయితే రిలీజ్ కి ముందు యూనివర్సల్ సబ్జెక్ట్ కావడంతో పెద్ద మొత్తంలో వసూలు సాధిస్తుందని దర్శక నిర్మాతలు భావించారు. కానీ సీన్ మొత్తం రివర్స్ అయింది. మొత్తంగా బిజినెస్ బాగానే జరిగినప్పటికీ ఓపెనింగ్ కలెక్షన్స్ మాత్రం బీభత్సంగా పడిపోయాయి. మొత్తం కలెక్షన్ మూడు కోట్ల రూపాయలను కూడా రాబట్టలేకపోయిందంటే అర్థం చేసుకోవచ్చు. అందరూ సినిమా బాగుందని చెబుతున్నారు…కానీ కలెక్షన్లు మాత్రం రాలేదు.

అయితే ఇటువంటి కథ తో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రానా ను అభినందించక తప్పదు. కానీ మినిమం వసూళ్ళు కూడా రాబట్టలేకపోవటం అనేది చిత్ర యూనిట్ కు నిరాశే అని చెప్పాలి. ఈ సినిమా ఇప్పటి వరకు 2.5 కోట్లు కలెక్షన్ సాధించి అక్కడితో ఆగిపోవడం చాలా పెద్ద మైనస్ గా చెప్పుకోవచ్చు. ఈ సినిమా తర్వాత రానా విరాటపర్వం తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. మరి ఆ సినిమా ఏవిధంగా కలెక్షన్లు సాధిస్తుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement