Monday, April 29, 2024

Avika Gore: ఉమాపతి ప్రేమకథ

గ్రామీణ ప్రేమకథా చిత్రాలకు ప్రేక్షకాదరణ ఎక్కువగా ఉంటుంది. అలాంటి కథతో ‘ఉమాపతి’ పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఇందులో అనురాగ్‌ హీరోగా, అవికా గోర్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. కే.కోటేశ్వరరావు నిర్మిస్తున్నారు. సత్య ద్వారంపూడి దర్శకుడు.

ఇప్పటికే విడుదలైన ఈ సినిమాకు సంబంధించిన పోస్టర్లు, పాటలు, టీజర్‌ అన్నీ చిత్రంపై ఆసక్తిని కలిగించారు. తాజాగా సినిమా ట్రైలర్‌ సైతం విడుదల చేశారు.
ట్రైలర్‌లో గ్రామీణ వాతావరణం, విభిన్న మనస్తత్వాలున్న మనుషులు, అల్లరిగా తిరిగే హీరో, రెండు గ్రామాల మధ్య గొడవలు, అవే హీరో హీరోయిన్ల ప్రేమకు అడ్డంకిలా మారినట్టు చూపించారు. ట్రైలర్‌లో సహజత్వం ఉట్టిపడుతోంది.
‘ ఫిదా’ వంటి హిట్‌ చిత్రానికి సంగీతం అందించిన సంగీత దర్శకుడు శక్తికాంత్‌ కార్తీక్‌ సంగీతం అందించారు. రాఘవేంద్ర ఛాయాగ్రహణం, గౌతమ్‌ రాజు, నాని ఎడిటర్లుగా పనిచేస్తున్నారు. ఈ సినిమా ఇదే నెల 29న ప్రేక్షకుల ముందుకురానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement