Monday, April 29, 2024

జైల‌ర్ నుండి ట్రైలర్ రిలీజ్.. త‌న స్వాగ్ తో ఆక‌ట్టుకుంటున్న ర‌జినీకాంత్

యువ దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘‘జైలర్’’. ఈ మూవీలో మోహన్ లాల్, జాకీ ష్రాఫ్, శివరాజ్ కుమార్, నాగబాబు వంటి ప్ర‌ముఖులు కీలక పాత్రలు చేస్తున్నారు. ఇక ఈ మూవీ ఆగష్టు 10న గ్రాండ్ గా పలు భాషల ఆడియన్స్ ముందుకి రానుంది.

రిలీజ్ డేట్ ద‌గ్గ‌ర పుడుతుండ‌టంతో ప్ర‌మోషన్స్ ని వేగ‌వంతం చేశారు మేక‌ర్స్. ఇప్పటికే ఈ మూవీ నుండి రిలీజ్ అయిన సాంగ్స్, పోస్టర్స్ అందరినీ ఆకట్టుకుని మూవీ పై మంచి హైప్ క్రియేట్ చేశాయి. ప్ర‌మోష‌న్స్ లో భాగంగా నే ఇవ్వాల కొద్ది సేప‌టి క్రితం మూవీనుంగడి ‘షోకేస్’ పేరుతో తెలుగు థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసారు.

- Advertisement -

ఇక ట్రైలర్ లో రజినీకాంత్ పవర్ఫుల్ స్టైల్, లుక్స్, డైలాగ్స్, ఆకట్టుకునే విజువల్స్ తో పాటు అలరించే థ్రిల్లింగ్ యాక్షన్ సన్నివేశాలు, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో బాగున్నాయి. ఇక మొత్తంగా అయితే జైలర్ ట్రైలర్ మాస్ యాక్షన్ హంగులతో అదిరిపోవడంతో పాటు మూవీ పై ఇప్పటివరకు ఉన్న అంచనాలు అమాంతంగా పెంచేసిందనే చెప్పాలి.

YouTube video

Advertisement

తాజా వార్తలు

Advertisement