Sunday, April 28, 2024

రీ రిలీజ్ కానున్న‌.. ప‌వ‌న్ క‌ల్యాణ్ తొలిప్రేమ

మ‌రో క్లాసిక‌ల్ మూవీ రీ రిలీజ్ కి సిద్ధ‌మ‌యింది. ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ల్యాణ్ న‌టించిన తొలిప్రేమ‌. ఈ చిత్రం అప్ప‌ట్లో సెన్సేష‌న్ ని క్రియేట్ చేసింది. ఈ సినిమాతో ప‌వ‌న్ క‌ళ్యాణ్‌ను ఫ్యామిలీ ఆడియెన్స్‌, యూత్‌కు క‌నెక్ట్ చేసింది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర కలెక్షన్స్ తో దుమ్ము లేపి రికార్డ్ లు క్రియేట్ చేసింది. తెలుగులో వచ్చిన ఎపిక్ ల‌వ్ స్టోరీస్‌లో ఇదొక సినిమాగా నిలిచింది. ఈ సినిమాను 4కె రెజ‌ల్యూష‌న్‌తో మ‌ళ్లీ రిలీజ్ చేయ‌టానికి ప్లాన్ చేసారు. ఈ సినిమాను జూన్ 30,2023న రిలీజ్ చేస్తున్నామని అఫీషియల్ గా ప్రకటించారు. కొత్త దర్శకుడు ఏ కరుణాకరణ్ చెప్పిన కథ నచ్చి తొలి ప్రేమ సినిమా చేసారు పవర్ స్టార్. తెలుగమ్మాయి కీర్తి రెడ్డి హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించింది. ‘ఎస్.ఎస్.వి ఆర్ట్స్’ బ్యానర్‌పై జివిజి రాజు నిర్మించిన ఈ చిత్రం సంచలన విజయం సాధించడమే కాకుండా.. తెలుగు ఇండస్ట్రీలో ఎప్పటికీ నిలిచిపోయే క్లాసిక్ హోదాను అందుకుంది. ఈ చిత్రం రీ రిలీజ్ తో ఎంత క‌లెక్ష‌న్స్ చేయ‌నుందో చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement