Friday, May 17, 2024

Neha Shetty: టిల్లు గాడి ల‌వ్వ‌ర్ కేక‌….

యంగ్ బ్యూటీ నేహాశెట్టి లేటెస్ట్ లుక్ తో ఆకట్టుకుంటోంది. పద్దతిగా ట్రెడిషనల్ వేర్ లో మెరిసినా ఈ ముద్దుగుమ్మ మెరుపులకు మాత్రం ఫ్యాన్స్, నెటిజన్లు మంత్రముగ్ధులు అవుతున్నారు. డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ యంగ్ హీరోయిన్ నేహా శెట్టిని టాలీవుడ్ కు పరిచయం చేశారు.

‘మెహబూబా’ చిత్రంతో ఈ ముద్దుగుమ్మ తెలుగు ఆడియెన్స్ కు పరిచయం అయ్యింది. అప్పటి నుంచి ఇక్కడే వరుస చిత్రాలు చేస్తోంది. కానీ ఈ బ్యూటీకి గుర్తింపు తెచ్చిపెట్టిన సినిమా మాత్రం DJ Tillu. సిద్ధూ జొన్నలడ్డ సరసన నటించి మెప్పించింది.రాధిక పాత్రలో డీజే టిల్లు లవర్ గా ఆకట్టుకుంది. తన నటనతో ఆడియెన్స్ ను కట్టిపడేసింది. ఈ చిత్రం తర్వాత నేహాకు టాలీవుడ్ లో వరుస ఆఫర్లు అందుతూ వచ్చాయి. ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో అలరిస్తోంది. ఓవైపు సినిమాలతో అలరిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా కనిపిస్తోంది. తన బ్యూటీఫుల్ ఫొటోషూట్లతో ఆకట్టుకుంటోంది.

- Advertisement -

లేటెస్ట్ ఫ్యాషన్ ను పరిచయం చేస్తూనే మరోవైపు గ్లామర్ విందు చేస్తోంది. సంప్రదాయా దుస్తుల్లో మెరుస్తూనే నేహా శెట్టి తన అందంతో ఆకట్టుకుంటోంది. మరిన్ని ఆఫర్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ముద్దుగుమ్మ దర్శకనిర్మాతల కంట్లో పడేందుకు ఇలా ప్రయత్నిస్తోంది

Advertisement

తాజా వార్తలు

Advertisement