Monday, April 15, 2024

TS – ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య

తెలంగాణ ఫైనాన్స్‌ కమిషన్‌ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ సిరిసిల్ల రాజయ్యను సర్కారు నియమించింది. రాష్ట్ర ఫైనాన్స్‌ కమిషన్‌ సభ్యులుగా ఎం.రమేశ్‌, సంకేపల్లి సుధీర్‌రెడ్డి, నెహ్రూ నాయక్‌ మాలోత్‌ను నియమిస్తూ గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు.

వీరంతా రెండేళ్లపాటు పదవిలో కొనసాగనున్నారు. సిరిసిల్ల రాజయ్య వరంగల్‌ (ఎస్‌సీ) పార్లమెంట్‌ స్థానం నుంచి 15వ లోక్‌సభకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి పోటీ చేసి గెలుపొందారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement