Tuesday, April 30, 2024

రానా చేతులమీదుగా.. ఉస్తాద్ టీజ‌ర్

డిఫ‌రెంట్ చిత్రాల‌తో దూసుకుపోతున్నాడు సింహా కోడూరి. ఆయ‌న న‌టిస్తున్న తాజా చిత్రం ఉస్తాద్..ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. వారాహి బ్యానర్ లో నిర్మితమవుతున్న ఈ సినిమాతో, ఫణిదీప్ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. తాజాగా ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ కి ముహూర్తాన్ని ఖరారు చేశారు .. వేదికను సెట్ చేశారు. హైదరాబాద్ – ఆర్కే సినీ ప్లెక్స్ లో రేపు ఉదయం 9:30 గంటలకు ఈ సినిమా టీజర్ ను హీరో రానాతో లాంచ్ చేయించనున్నారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. సింహా కోడూరి జోడీగా ఈ సినిమాలో కావ్య కల్యాణ్ రామ్ కనిపించనుంది. త్వరలోనే రిలీజ్ డేట్ ను ప్రకటించనున్నారు.కీరవాణి తనయుడుగా సింహా కోడూరి హీరోగా ఎంట్రీ ఇచ్చి చాలా కాలమే అయింది. మత్తువదలరా .. తెల్లవారితే గురువారం .. దొంగలున్నారు జాగ్రత్త వంటి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. కుదురుగా కనిపించే సింహా, కుర్ర హీరోలకు గట్టి పోటీనిచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement