Saturday, May 11, 2024

‘మా’ పోటీ వేడెక్కుతోంది !!

మా అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో టాలీవుడ్ లో రచ్చ మొదలైంది. అయితే ఈసారి ఎన్నికలు రసవత్తరంగా కూడా మారనున్నాయి. గతంలో శివాజీ రాజా ప్యానల్ పై సీనియర్ నటుడు నరేష్ ప్యానెల్ విజయం సాధించారు. అయితే ఈసారి మాత్రం పోటీ కాస్త గట్టిగా మారనుంది. ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. అలాగే మోహన్ బాబు కుమారుడు మంచు విష్ణు కూడా మా ఎన్నికలలో పోటీ చేస్తున్నట్లు ప్రకటించాడు. తాజాగా జీవిత రాజశేఖర్ కూడా మా అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు.

అయితే ఈసారి పోటీ చేస్తున్న వారందరికీ కూడా మంచి పరిచయాలు ఉండటం అందరితో సాన్నిహిత్యం ఉండటం ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. మొన్న సూపర్ స్టార్ కృష్ణ ను మోహన్ బాబు తన కొడుకుతో కలిసి వెళ్లి తమ మద్దతు తెలపాలని కోరారు. అలాగే మెగా బ్రదర్ నాగబాబు ప్రకాష్ రాజ్ కి మద్దతుగా నిలిచారు. ఈ రసవత్తర పోరులో ఎవరు మా అధ్యక్ష పదవిని చేపడతారు అనేది ఆసక్తిగా మారింది. సెప్టెంబర్ లో మా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. మరి చూడాలి ఈ సారి ఎవరు ఆ పదవిని దక్కించుకుంటారో.

Advertisement

తాజా వార్తలు

Advertisement