Monday, April 29, 2024

ఆర్ ఆర్ ఆర్….తగ్గేదేలే

బాహుబలి సినిమా తర్వాత ఎంతో ప్రతిష్టాత్మకంగా రాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొమరం భీం గా, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు గా కనిపించబోతున్నారు. అయితే 90 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న చిత్ర యూనిట్ మిగిలిన భాగాన్ని వచ్చే నెల 10 నుంచి స్టార్ట్ చేయబోతున్నారు.

అయితే షూటింగ్ ఆగస్టు నెల వరకు ఉంటుందని తెలుస్తోంది. ఇదిలావుండగా మరోవైపు పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా ఒక్కోటి జరుగుతూ వస్తున్నాయి. కాబట్టి అనుకున్న సమయానికి అనుకున్నట్టుగానే అక్టోబర్ 13 నాటికి సినిమాను రిలీజ్ చేసేలా దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారట. ఇక యూనిట్ సభ్యుల ప్లానింగ్ చూస్తుంటే ఫ్యాన్స్ కూడా ఆర్ఆర్ఆర్ రిలీజ్ విషయంలో ఎటువంటి సందేహాలు పెట్టుకొనక్కరలేదని అర్థం అవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement