Wednesday, April 14, 2021

టాలీవుడ్ మొత్తాన్ని దించేసిన వార్నర్

ఆస్ట్రేలియా క్రికెట్ ఆటగాడు… సన్ రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో కొత్తగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా తెలుగు పాటలకు అదిరిపోయే స్టెప్పులు వేస్తూ వార్నర్ అభిమానులను అలరిస్తు ఉంటారు. ఇక ఇటీవల కాలంలో ఫేస్ మార్ఫింగ్ యాప్ ద్వారా మరింత హంగామా చేస్తున్నాడు వార్నర్.

ఇక తాజాగా మరో వీడియోని పోస్ట్ చేశాడు.. ఈ వీడియోలో సైరా నరసింహారెడ్డి గా, వినయ విధేయ రామగా, సాహో ప్రభాస్గా, అలా వైకుంఠపురములో అల్లు అర్జున్ గా, మాస్టర్ విజయ్ గా, అర్జున్ రెడ్డి, శ్రీమంతుడు, జయ జానకి నాయక, ఆచార్య, మర్యాద రామన్న, టెంపర్, భీష్మ వంటి గెటప్ లలో కనిపించాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే టాలీవుడ్ హీరోల అందర్నీ దింపేసాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మీరు కూడా ఓ లుక్కేయండి.

https://www.instagram.com/p/CNRYHr1lZGn/?igshid=nd5vv5y1skhj

Advertisement

తాజా వార్తలు

Prabha News