Tuesday, April 30, 2024

ఓటీటీ లో సిటీమార్ ?

గోపీచంద్ హీరోగా సంపత్ నంది దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సిటీమార్. స్పోర్ట్స్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా లో గోపీచంద్ సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తుంది. ఇందులో గోపిచంద్ ఆంధ్ర కబడ్డీ ఫిమేల్ జట్టు కోచ్ గా కనిపించనున్నాడు. తెలంగాణ ఫీమేల్ కబడ్డీ జట్టు కోచ్ గా తమన్నా కనిపించనుంది.

అయితే తమన్నా అసిస్టెంట్ పాత్ర ఈ సినిమాకు హైలైట్ గా నిలువనుందని తెలుస్తోంది. ఆ పాత్ర వెన్నెల కిషోర్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా తాజా సమాచారం సినిమాకి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అమెజాన్ ప్రైమ్ భారీ ఆఫర్ వచ్చిందట. ఈ నేపధ్యంలోనే ఈ సినిమా ఓటీటీలో రాబోతుంది అంటూ సోషల్ మీడియా లో వార్తలు వస్తున్నాయి. మరి ఈ వార్తల్లో ఎంత నిజం ఉంది అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement