Saturday, May 4, 2024

సర్కారు వారికి రెండు పుట్టినరోజులు – రెండు అప్డేట్స్

సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సర్కారు వారి పాట. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మహేష్ బాబు సరసన కీర్తి సురేష్ నటిస్తోంది. ఇదిలా ఉండగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త సోషల్ మీడియా లో వైరల్ అవుతుంది.

సూపర్ స్టార్ కృష్ణ పుట్టిన రోజు మే 31న సర్కారు వారి పాట ఫస్ట్ లుక్ ను విడుదల కాబోతుందని.. అలాగే మహేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా ఆగస్టు 9న ఈ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల కానుందని తెలుస్తోంది. ఇప్పటికే మొదటి షెడ్యూల్ ను దుబాయ్ లో కంప్లీట్ చేయగా హైదరాబాద్ లో రెండవ షెడ్యూల్ కోసం ప్రత్యేకంగా సెట్ ను వేశారు. కానీ స్టార్ట్ చేసిన కొద్ది రోజులకే కరోనా మహమ్మారి కారణంగా వాయిదా పడింది. ఇక ఈ సినిమాను 14 రీల్స్ బ్యానర్, మైత్రి మూవీ మేకర్స్ తో కలిసి నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement