Tuesday, April 30, 2024

Sold out | ‘ఈ నగరానికి ఏమైంది’ రీ-రిలీజ్‌కి అద్భుతమైన స్పందన..

తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో తెర‌కెక్కిన యూత్ ఫుల్ ఎంట‌ర్టైన‌ర్ ఈ నగరానికి ఏమైంది. విశ్వక్సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమతం, వెంకటేష్ కాకుమాను ప్రధాన పాత్రలు పోషించిన‌ ఈ సినిమా విడుదలై ఐదేళ్లు పూర్తయింది. అయితే ప్ర‌స్తుతం టాలీవుడ్ లో రీ-రిలీజ్ ట్రెండ్ సాగుతుంది. దీంతో ఈ నగరానికి ఏమైంది సినిమాని కూడా రీ-రిలీజ్ చేయాల‌ని ఈ మూవీ ఫ్యాన్స్ చాలా రోజుల‌నుండి మేక‌ర్స్ ని అడుగుతున్నారు. చివ‌రికి రీసెంట్ గా ఈ మూవీని ఈ నెల (జూన్) 29న సెలెక్ట‌డ్ స్క్రీన్స్ లో రీ-రిలీజ్ ప్లాన్ చేశారు.

- Advertisement -

కాగా, అడ్వాన్స్ బుకింగ్‌లు ఇప్పటికే ప్రారంభమయ్యాయి. బుకింగ్స్ కి స్పందన అద్భుతంగా వ‌స్తుంది. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో బుకింగ్స్ అద్భుతంగా జ‌రుగుతున్నాయి. కాగా, ఎపీ తెలంగాణ లో ఈ మూవీ టికెట్లు పూర్తిగా అమ్ముడుపోయాయి. ఈ విష‌యాన్ని సోష‌ల్ మీడియా వేదిక‌గా పంచుకుంటూ ఆనందం వ్య‌క్తం చేశాడు డైరెక్ట‌ర్ త‌రుణ్ భాస్క‌ర్. ఈ మూవీ తో పాటు త‌న కొత్త సినిమా కీడా కలా ట్రైల‌ర్ ని కూడా రిలీజ్ చేయ‌నున్న‌ట్టు ప్ర‌క‌టించాడు త‌రుణ్‌.

Advertisement

తాజా వార్తలు

Advertisement