Friday, April 26, 2024

అప్పుడే అవ్వలేదు – తగ్గేదేలే !! పుష్ప నిర్మాతలు

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం పుష్ప. తాగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను రిలీజ్ చేసి సినిమాపై అంచనాలను పెంచారు చిత్ర యూనిట్. ఇక ఈ టీజర్ సోషల్ మీడియాలో దూసుకెళుతోంది. 12 మిలియన్ వ్యూస్ , 6 లక్షలకు పైగా లైక్స్ ఈ సినిమా సాధించింది. ఇక ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ను నిర్మాతలు సోషల్ మీడియా వేదికగా అనౌన్స్ చేశారు.

పుష్ప సినిమా నుంచి అప్డేట్ అప్పుడే అయిపోలేదు. మరిన్ని అప్డేట్స్ సిద్ధంగా ఉన్నాయి. తగ్గేదేలే అంటూ పోస్ట్ పెట్టారు. ఇక నిర్మాతలు చేసిన అనౌన్స్మెంట్ చూసిన బన్నీ అభిమానులు మరింత ఉత్సాహాన్ని చూపిస్తున్నారు. కాగా ఈ సినిమాలో బన్నీ సరసన రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మరోవైపు మలయాళ స్టార్ నటుడు ఫహద్ ఫాజల్ విలన్ గా నటిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్లో ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement