Monday, April 29, 2024

వెంకీ మామ….ఆలోచన మారింది!! థియేటర్స్ లో నారప్ప ?

విక్టరీ వెంకటేష్ హీరోగా శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం నారప్ప. తమిళంలో ధనుష్ నటించిన అసురన్ సినిమాకు రీమేక్ గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. ఇక నారప్ప సినిమాలో వెంకటేష్ సరసన ప్రియమణి హీరోయిన్ గా నటిస్తోంది. అయితే ఈ సినిమా ఓటిటి లో రిలీజ్ కాబోతోంది అంటూ గత కొన్నాళ్లుగా వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా ఇదే విషయమై అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు.

కాగా తాజా సమాచారం ప్రకారం నారప్ప ను మొదట థియేటర్స్ లో రిలీజ్ చేయాలనే పునరాలోచనలో పడ్డారట దర్శకనిర్మాతలు. థియేటర్స్ లో ఖచ్చితంగా మంచి కలెక్షన్లు సాధించే అవకాశం ఉందనే ఆశాభావంతో ఉన్నారట.మరి చూడాలి వెంకీ మామ థియేటర్స్ లో సందడి చేస్తాడా లేకపోతే ఓటీటీ తోనే సరిపెట్టుకుంటాడా అనేది.

Advertisement

తాజా వార్తలు

Advertisement