Sunday, April 28, 2024

ఊరు పేరు భైరవకోన..

ప్ర‌భ‌న్యూస్ : వైవిధ్యమైన కథాంశంతో సందీప్‌ కిషన్‌ కథానాయ కుడిగా రూపొందుతున్న చిత్రం ‘ఊరు పేరు భైరవ కోన’. విఐ. ఆనంద్‌ దర్శకుడు ఫాంటసీ కథతో తెరకెక్కిస్తున్నారు. అనిల్‌ సుంకర సమర్పణలో రాజేష్‌ దండా నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శరవేగం గా జరుగుతోంది. సందీప్‌ కిషన్‌ పుట్టినరోజు సందర్భంగా సినిమా టైటిల్‌తో పాటుగా ఫస్ట్‌లుక్‌ ఇంకా మేకింగ్‌ వీడియోను చిత్ర బృందం విడుదల చేసింది. ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌లో ఫాంటసీ ప్రపంచాన్ని చూపించారు. మేకింగ్‌ వీడియోలో విజువల్స్‌ ఆసక్తి కలిగిస్తున్నాయి. సందీప్‌ కిషన్‌ లుక్‌ ఆకట్టుకునే విధంగా ఉంది. వంటినిండా మంటలతో ఓ వ్యక్తి నీళ్ళలోకి దూకుతున్న సీన్స్‌ అలరిస్తున్నాయి. కావ్య థాపర్‌, వర్ష బొల్లమ్మ నాయికుగా నటిస్తున్న ఈ చిత్రానికి రాజ్‌ తోట ఛాయాగ్రహణం, శేఖర్‌ చంద్ర సంగీతం అందిస్తున్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement