Monday, April 29, 2024

డింపుల్ పై త‌ప్పుడు కేసు పెట్టార‌న్న లాయ‌ర్

న‌టి డింపుల్ హ‌యాతిపై ఫాల్స్ కేసు పెట్టార‌ని ఆమె లాయ‌ర్ స‌త్య‌నారాయ‌ణ అన్నారు. డింపుల్ ఎక్కడ కూడా కారుని తన్నిన ఫుటేజ్ లేదని తెలిపారు. డింపుల్ మీద నమోదైన ఎఫ్ఐఆర్ ఫాల్స్ ఎఫ్ఐఆర్ అని ఆరోపించారు. డేవిడ్, డింపుల్ ఇద్దరు డీసీపీ రాహుల్ కారు కవర్ కూడా తొలగించారని ఎఫ్ఐఆర్ లో ఉందని.. కానీ సీసీ ఫుటేజ్ లో అలాంటి విజువల్స్ లేవని వివరించారు.
డీసీపీ అయి ఉండి కూడా రాహుల్ మీడియా ముందు అబద్ధాలు ఆడుతున్నాడన్నారు. జంతువులతో మిస్ బిహేవ్ చేసినప్పుడు డింపుల్ అతనికి వార్నింగ్ ఇచ్చిందని.. తన పరువు పోతుందని ఇన్ని ఆరోపణలు ఆయన చేస్తున్నాడన్నారు. ఈ వివాదంతో డింపుల్ మెంటల్ స్ట్రెస్ కి గురైందన్నారు. ప్రస్తుతం ఆమె బయటికి వెళ్లడానికి భయపడుతుందని వెల్ల‌డించారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement