Friday, April 26, 2024

డైరెక్టర్ అవుతానంటున్న వకీల్ సాబ్ బ్యూటీ

నివేద థామస్ గురించి తెలుగు తమిళ సినీ ప్రేక్షకులకు పరిచయం అవసరంలేదు. తన అందం అభినయంతో ప్రేక్షకులను ఇట్టే ఆకట్టుకుంటుంది నివేద థామస్. ఇటీవలే పవన్ కళ్యాణ్ వకీల్ సాబ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే భవిష్యత్తులో కచ్చితంగా డైరెక్షన్ చేస్తానని చెబుతోంది ఈ అమ్మడు. చిన్నతనం నుంచి యాక్టింగ్ స్టార్ట్ చేసిన నివేదా… సినిమాలు చేస్తూ గ్యాప్ వచ్చిన సమయంలో డైరెక్షన్ కోర్స్ కూడా చేసిందట.

అందుకే భవిష్యత్తులో ఎలాగైనా సరే దర్శకత్వం చేస్తానని అలాగే మంచి మంచి పాత్రల్లో కూడా నటిస్తానని చెబుతోంది. కొన్నేళ్ల తర్వాత డైరెక్టర్ గా మారుతా అని అయితే మొదట షార్ట్ ఫిలిమ్స్ చేసి ఆ తర్వాత పూర్తి స్థాయిలో దర్శకురాలిగా మారాలి అనుకుంటున్నానని చెప్పుకొచ్చింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement