Saturday, April 27, 2024

ఎన్టీఆర్ కొరటాల సినిమాలో హీరోయిన్ ఫిక్స్ ?

యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన 30 వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో చేయబోతున్నట్లు అధికారికంగా ప్రకటన విడుదల చేశారు. ఈ సినిమా యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కబోతోంది. అయితే ఈ సినిమా అనౌన్స్ చేసినప్పటి నుంచి ఈ సినిమాలో హీరోయిన్ గురించి చర్చలు స్టార్ట్ అయ్యాయి. గతంలో ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ సినిమా బాక్సాఫీస్ వద్ద మంచి విజయం సాధించింది. ఇక ఆ చిత్రంలో సమంత నిత్యమీనన్ హీరోయిన్ గా నటించారు.

ఇక ఇప్పుడు ఈ సినిమాపై అంతకు మించి అంచనాలు ఉన్నాయి. పాన్ ఇండియా లెవెల్ లో తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో బాలీవుడ్ భామ కియారా అద్వానీ ని హీరోయిన్ గా తీసుకోబోతున్నారని తెలుస్తోంది. భరత్ అనే నేను, వినయ విధేయ రామ చిత్రాలలో ఈ అమ్మడు నటించింది. అయితే ఎన్టీఆర్ 30వ సినిమా ని స్టార్ చేయక ముందే 2022 ఏప్రిల్ 29న రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించటం విశేషం.

Advertisement

తాజా వార్తలు

Advertisement