Monday, April 29, 2024

పుష్ప కూడా స్టార్ట్ అయింది!!

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న చిత్రం పుష్ప. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ సరసన రష్మీక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన టీజర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇదిలా ఉండగా కరోనా కారణంగా వాయిదా పడ్డ సినిమా షూటింగ్ లు ఇటీవలే ఒక్కొక్కటిగా ప్రారంభమవుతున్నాయి.

ఈ నేపథ్యంలోనే పుష్ప కూడా ఈ రోజు నుండి షూటింగ్ ను స్టార్ట్ చేసిందని తెలుస్తోంది. కాగా షూటింగ్ లో బన్నీ కూడా అడుగు పెట్టినట్లు సమాచారం. మొత్తం 45 రోజుల పాటు షూటింగ్ గ్యాప్ లేకుండా ఈ షెడ్యూల్ జరగనుందట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా మైత్రి మూవీ మేకర్స్ వారు భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement