Thursday, May 9, 2024

విజువల్‌ ట్రీట్‌గా ‘విక్కీ ది రాక్‌ స్టార్‌’ ఫస్ట్‌ షేడ్‌

విక్రమ్‌, అమత చౌదరి ప్రధాన పాత్రలలో సిఎస్‌ గంటా దర్శకత్వంలో వైవిద్యభరితమైన కథతో ‘విక్కి ది రాక్‌ స్టార్‌’ అనే పేరుతో ఓ డిఫరెంట్‌ మూవీ రూపొందుతోంది. హై ప్రొడక్షన్‌ వాల్యూస్‌ జోడించి శ్రీమతి వర్దిని నూతలపాటి సమర్పణలో స్టూడియో87 ప్రొడక్షన్స్‌ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఫ్టైట్‌ లెప్టినెంట్‌ శ్రీనివాస్‌ నూతలపాటి నిర్మాతగా వ్యవహిరిస్తున్నారు. సుభాష్‌, చరిత ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్స్‌ గా బాధ్యతలు చేపట్టారు. భాస్కర్‌ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తుండగా.. పలు హిట్‌ సినిమాలకు మ్యూజిక్‌ అందించిన సునీల్‌ కశ్యప్‌ బాణీలు అందించారు.

తాజాగా ఈ చిత్రం నుంచి అప్డేట్‌ వచ్చింది. విక్కీ ది రాక్‌ స్టార్‌ నుంచి ఫస్ట్‌ షేడ్‌ను విడుదల చేశారు. ‘ఫస్ట్‌ లవ్‌.. జీవితంలో ఎవరికైనా ఫస్ట్‌ లవ్‌ మిగిల్చే జ్ఞాపకాలు మరవడం కష్టం.. అవి మరిస్తే ఒక వరం.. మరవలేకపోతేనే మరణం.. వాటిని మరిచేదెలా.. మరిచి బ్రతికేదెలా.. అమతా’ అంటూ సాగే ఈ ఫస్ట్‌ షేడ్‌లో ఎంతో ఎమోషనల్‌ కంటెంట్‌ ఉన్నట్టు అనిపిస్తోంది. ఇక విజువల్స్‌ అద్భుతంగా ఉన్నాయి. ఎమోషనల్‌ కంటెంట్‌కు తగ్గట్టుగా సునీల్‌ కశ్యప్‌ మంచి నేపథ్య సంగీతాన్ని అందించారు.

YouTube video

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement