Thursday, May 2, 2024

కేజీఎఫ్2 రిలీజ్ పై పక్కా ప్లాన్ ?

కరోనా మహమ్మారి కారణంగా చాలా సినిమాలు రిలీజ్ వాయిదా వేసుకున్నాయి. అలాగే షూటింగ్ దశలో ఉన్న సినిమాలు షూటింగ్ ని కూడా వాయిదా వేసుకున్నాయి. ఇక ఇప్పుడిప్పుడే కరోనా తగ్గుముఖం పడుతుండటంతో థియేటర్లలోకి రావడానికి వివిధ భాషలలో చిత్రాలు సిద్ధమవుతున్నాయి. ముఖ్యంగా వాటన్నింటిలో కే జి ఎఫ్ చాప్టర్2 పై అందరి దృష్టి ఉంది. రెండు సంవత్సరాల క్రిందట వచ్చిన కేజిఎఫ్ ఘన విజయం సాధించడంతో ఈ సినిమా పై ప్రేక్షకుల అంచనాలు ఎంతగానో పెట్టుకున్నారు.

నిజానికి గతేడాది దసరాకి రావాల్సిన ఈ చిత్రం కరోనా కారణంగా వాయిదా పడింది. కాగా ఈ ఏడాది జూలై 16న విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేశారు. కానీ అది కూడా కష్టమే అనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే చిత్ర యూనిట్ వినాయకచవితి మీద కన్నేసినట్లు తెలుస్తోంది. సెప్టెంబర్ 10న వినాయకచవితి కాగా ముందు రోజు కేజిఎఫ్ 2 రిలీజ్ చేయాలని చూస్తున్నారట. కరోనా థర్డ్ వేవ్ ముప్పు లేకుంటే థియేటర్లు 100% ఆక్యుపెన్సీ తో నడిస్తే వసూళ్లకు డోకా ఉండదని ప్లాన్ చేస్తున్నారట మేకర్స్.

Advertisement

తాజా వార్తలు

Advertisement