Tuesday, April 23, 2024

ఇండియన్స్ కి మేమంటే ఇష్టమే: కేన్‌ విలియమ్సన్‌

ఐసీసీ ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ టైటిల్‌ గెలవడం ఆనందంగా ఉందని న్యూజిలాండ్‌ సారథి కేన్‌ విలియమ్సన్‌ అన్నాడు. అవును, ఇది శిఖర సమానమైన విజయమే. ఎవరు కాదనగలరు! టీమ్‌ఇండియాతో ఫైనల్‌ ఆడిన వ్యక్తిగా నేనది చెప్పగలను. 2019లోనూ మేం అద్భుతంగా క్రికెట్‌ ఆడాం. అయితే మాకిప్పుడు అనుకూలంగా ఫలితం రావడంతో కాస్త భిన్నమైన అనుభూతి కలుగుతోంది’ అని కేన్‌ తెలిపాడు. ఇక ఫైనల్లో టీమ్‌ఇండియాను ఓడించినంత మాత్రాన భారత అభిమానుల్లో మాపై ఇష్టం మారదనే అనుకుంటున్నా. బహుశా మేం వారి రెండో ఫేవరెట్‌ జట్టైనందుకు సంతోషిస్తున్నాం. ఇక మీదటా ఆ అభిమానం అలాగే ఉంటుందని భావిస్తున్నా’ అని కేన్‌ అన్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement