Thursday, April 25, 2024

RRR యుఎస్ఏ రైట్స్ దక్కించుకుంది ఎవరో తెలుసా ?

బాహుబలి సినిమా తర్వాత దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ సినిమాలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్, కొమరంభీం కొమరం భీం గా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కనిపించబోతున్నారు. ఇక ఇప్పటికే ఈ ఇద్దరికీ సంబంధించిన వీడియోలను కూడా ఈ చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

మరోవైపు బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవ్ గన్ కూడా ఈ సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నారు. ఇక రామ్ చరణ్ సరసన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్, ఎన్టీఆర్ సరసన హాలీవుడ్ బ్యూటీ ఒలీవియా మోరిస్ నటిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను అక్టోబర్ 13న రిలీజ్ చేయబోతున్నారు.

ఇదిలా ఉండగా తాజాగా ఈ సినిమాకు సంబంధించిన యు ఎస్ ఏ థియేట్రికల్ రైట్స్ ను సరిగ మా సినిమాస్ మరియు రాఫ్తార్ క్రియేషన్స్ సంయుక్తంగా దక్కించుకున్నట్లు ఆ సంస్థలు అఫిషియల్ గా అనౌన్స్ చేశాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement