Friday, March 29, 2024

అప్రమత్తంగా సమయస్ఫూర్తిగా ఎన్నికల విధులు నిర్వహించండి – ఎస్పీ అన్బురాజన్

కమలాపురం – జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికలలో భాగంగా ఎనిమిదవ తేదీ ఉదయం పోలింగ్ ప్రక్రియ ప్రారంభం నుంచి పూర్తయ్యే వరకు ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా సమయస్ఫూర్తితో ఎన్నికల విధులు నిర్వహించాలని యస్ పి అన్బురాజన్ పోలీసులసిబ్బందికి సూచించారు.బుధవారం కమలాపురం లోని టిటిడి కళ్యాణ మండపం లో మండలంలో జరగనున్న రెండు ఎంపీటీసీ ఎన్నికల విధుల్లో పాల్గొంటున్న పోలీసు సిబ్బందికి సమావేశం నిర్వహించారు.క్యూలైన్లను క్రమపద్ధతిలో పాటించే విధంగా మరియు ఓటర్ల సమూహం బట్టి మహిళల కొసం ప్రత్యేకంగా వరుసక్రమంలో పంపించాలన్నారు. మంచి నీళ్ళ బాటిల్ లు ఇంక్ సీసాలు బాల్ పెన్నులు మరియు మొబైల్ ఫోన్లు మొదలైన వాటిని అనుమతించకూడదని తెలిపారు.వంద మీటర్ల లోపు జన సమూహం లేకుండా చూసుకోవాలని బ్యానర్స్ మరియు ఎటువంటి ప్రచారాలకు అనుమతి లేకుండా చూడాలని ఆదేశించారు.
అదేవిధంగా ఓటు హక్కువినియోగించుకునేందుకు వచ్చే ఓటర్లు ముఖ్యంగా మహిళలల వృద్ధుల పట్ల మర్యాదపూర్వకంగా మరియు స్నేహపూర్వకంగా వ్యవహరించాలని తెలియజేశారు.ఎన్నికలు ప్రశాంతమైన వాతావరణంలో సజావుగా జరిగేటట్లు సిబ్బంది ఉండాలన్నారు. ఈ విధంగా వ్యవహరించి జిల్లా పోలీసు శాఖకు పేరుప్రతిష్ఠలు తీసుకురావాలని జిల్లా ఎస్పీ అన్నారు.ఎన్నికల విధులకు సంబంధించిన బందోబస్తు అంశాలపై దిశానిర్దేశం చేశారు.ఈ కార్యక్రమంలో కడప డీఎస్పీ సునీల్ ఎర్రగుంట్ల సర్కిల్ పరిధిలోని సిఐలు ఎస్సైలు పోలీసులు పాల్గొన్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement