Wednesday, May 1, 2024

Thangalaan : విక్ర‌మ్ ‘‘తంగ‌లాన్’’ టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్..

తమిళ్ స్టార్ హీరో విక్రమ్ లేటెస్ట్ అప్ క‌మింగ్ మూవీ ‘‘తంగ‌లాన్’’. పా రంజిత్ దర్శకత్వంలో వ‌స్తొన్న ఈ సినిమా కోలార్ బంగారు గనుల కార్మికుల జీవిత కథల ఆధారంగా తెర‌కెక్కుతున్నట్టు తెలుస్తొంది. కాగా, ఈ మూవీ నుండి రిలీజైన ప్రచార చిత్రాలకి ఇప్పటికే ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. గతంలో చాలా సినిమాల్లో విక్రమ్ డిఫరెంట్ డిఫరెంట్ గెటప్స్ లో కనిపించి ఆడియన్స్ ని థ్రిల్ ఫిల్ చేశాడు. ఈ సినిమాలో ఒక అడివి మనిషిలా గెట‌ప్ లో బీస్ట్ గా కనిపిస్తున్నాడు. ఇక ఈ మూవీలోని విక్రమ్ లుక్స్ చూసి సినిమా పై మంచి బజ్ క్రియేట్ అయ్యింది.

దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ఆడియెన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఈ మూవీని వచ్చే ఏడాది జనవరి 26న రిపబ్లిక్ డే నాడు రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించ‌గా.. టీజర్ ని నవంబర్ 1న ఆడియన్స్ ముందుకు తీసుకు వస్తామంటూ ప్రకటించారు. తెలుగులో ఈ సినిమాని యూవీ క్రియేషన్స్ రిలీజ్ చేయబోతున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమాలో పార్వతి, మాళవిక మోహనన్ ఫిమేల్ లీడ్స్ లో కనిపించబోతున్నారు. జివి ప్రకాష్ సంగీతం అందిస్తున్నాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement