Saturday, May 4, 2024

తేజ సజ్జా దిమ్మతిరిగే రెమ్యూనరేషన్?

చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో అడుగు పెట్టి మంచి పేరు తెచ్చుకున్నాడు తేజ సజ్జా. అలాగే ఇటీవల జాంబి రెడ్డి చిత్రంతో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చి సూపర్ డూపర్ హిట్ ని అందుకున్నాడు. దీంతో తేజ సజ్జా కు వరుస ఆఫర్లు వస్తున్నాయి. ఇదిలా ఉండగా తేజ రెమ్యూనరేషన్ విషయం ఇప్పుడు ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఏకంగా కోటి రూపాయలు డిమాండ్ చేస్తున్నాడట తేజ.

ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో హనుమాన్ సినిమా చేయబోతున్నాడు తేజ. ఈ సినిమా కి గాను కోటి రూపాయల రెమ్యునరేషన్ డిమాండ్ చేశాడట. అందుకు దర్శకనిర్మాతలు కూడా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. ఒక్క సినిమాకే కోటి రూపాయలా అంటూ ఆశ్చర్యపోతున్న వారు కూడా లేకపోలేదు. ఇదే స్పీడ్ లో కనుక తేజ మరో రెండు హిట్స్ కొడితే రెమ్యునరేషన్ మరింత పెంచే అవకాశం ఉందని అంటున్నారు విశ్లేషకులు.

Advertisement

తాజా వార్తలు

Advertisement